మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెట్టాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ Xలో తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మెడికల్ కాలేజ్ కు పింగళి పేరు పెడుతున్నామన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగువాళ్లు గర్వించదగిన మహనీయుడిని ఈ విధంగా స్మరించుకోవడం, గౌరవించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.