బందరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు జాతీయ పతాక రూపశిల్పి, బందరు ప్రాంత వాసి పింగళి వెంకయ్య పేరు పెట్టడం పట్ల సీఎం చంద్రబాబుకు సోమవారం మచిలీపట్టణం ఎంపీ బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు. బందర్ మెడికల్ కళాశాల స్థాపన నుంచి, సదరు కళాశాలకు నిధుల మంజూరు కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని పలుమార్లు కలిసి, కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు మంజూరు చేయించామని చెప్పారు. కళాశాలకు పింగళి పేరు పెట్టడం మంచి విషయం అన్నారు.