జిల్లాలోని పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ఓటరుగా పేర్లను వచ్చే నవంబరు 6వ తేదీలోగా నమోదు చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ పిలుపునిచ్చారు. పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల నేపథ్యంలో సోమవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో ఓటర్లుగా పేరు నమోదు చేసుకొనుటకు మచిలీపట్నం ఆర్డిఓ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెసి కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.