మద్యం టెండర్లలో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా సహించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. బుధవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపులు జరగాలన్నారు. సిండికేట్లకు సహకరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దరఖాస్తుదారులను మంత్రి కొల్లు రవీంద్ర కోరారు.