మీకోసం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని కృష్ణా జిల్లా ఎస్పి ఆర్. గంగాధరర్ రావు అన్నారు. సోమవారం మచిలీపట్నం పోలీసు కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా పలువురి వద్ద నుంచి ఆయన అర్జీలు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల విషయంలో అలసత్వం వహించకుండా సత్వర న్యాయం అందించేలా ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.