గ్రామాల్లో సబ్ డివిజన్స్, మ్యుటేషన్స్ వంటి భూసమస్యలపై వస్తున్న అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డీకే. బాలాజీ రెవిన్యూ అధికారులకు సూచించారు. మచిలీపట్నంలో బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం అర్జీలపై కలెక్టర్ సమీక్షిస్తూ మీకోసంలో వస్తున్న అర్జీలలో రెవెన్యూకు సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయని వాటిని పరిష్కరించాలన్నారు.