మచిలీపట్నం అభివృద్ధి బాటలో నడిచే విధంగా పనిచేయాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. మంగళవారం మచిలీపట్నంలోని మంత్రి కొల్లు రవీంద్ర నివాసం వద్ద నూతనంగా విధుల్లో చేరిన మున్సిపల్ ఇంజనీర్లు మంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మచిలీపట్నం అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.