డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు కృష్ణా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి షాహిద్ బాబు షేక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25తో దరఖాస్తుల గడువు ముగియనున్న నేపథ్యంలో మరో రెండు రోజులకు గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుపేద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.