పంట భూములలో సామూహిక ఎలుకలు నివారణకు సంబంధించి వ్యవసాయ శాఖ వారు రూపొందించిన కరపత్రికలను జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ సోమవారం మచిలీపట్నంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పంట చేతికి అంది వచ్చే సమయంలో ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుందని, వాటి నివారణకు వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు పాటించాలని తెలిపారు. బ్రోమోడయోలిన్ మందు వాడటం వల్ల ఎలుకల నివారణ సాధ్యం అవుతుందని సూచించారు.