వరద పోటెత్తడంతో కైకలూరు-ఏలూరు ప్రధాన రహదారిపై మూడు అడుగుల మేర నీరు చేరి సుమారు 10 రోజుల పాటు అష్టదిగ్బంధంలో చిక్కు కుంది. ప్రమాదకర స్థాయిలో రోడ్డుపై ఉన్నతాధికారుల ఆదేశాలతో రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేశారు. అయితే రెండు రోజుల నుంచి కొల్లేరు వరద క్రమేణా తగ్గు ముఖం పట్టి రాకపోకలకు అనుకూలంగా ఉంది. దీంతో ఆదివారం నుంచి పాక్షికంగా సోమవారం ఉదయం నుండి పూర్తిగా పోలీసులు వాహనాల రాకపోకలకు అనుమతించారు.