అర్హత కలిగిన సాగుదారులకు ఆక్వా జోన్ వర్తింపజేయాలి

66பார்த்தது
అర్హత కలిగిన సాగుదారులకు ఆక్వా జోన్ వర్తింపజేయాలి
అర్హత కలిగిన సాగుదారులకు ఆక్వా జోన్ వర్తింపజేయాలని లివింగ్ ఫర్ సొసైటీ ఛారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు జి. గోండ్రాల హనుమాన్ అయ్యప్ప అధికారులను కోరారు. జిల్లా మత్స్యశాఖ అధికారికి శనివారం వినతిపత్రం అందించారు. కలిదిండి, లోడిదలంక, గోపాలపురం, సానారుద్రవరం, వెంకటాపురం, కాళ్లపాలెం తదితర గ్రామాల్లో చెరువులు ఆక్వా జోన్లో లేవంటూ విద్యుత్తు సరఫరా కోసం అధికారులను సంప్రదిస్తే అనుమతులు ఇవ్వడం లేదన్నారు.

தொடர்புடைய செய்தி