గత ప్రభుత్వం దోపిడికి ప్రాధాన్యతనిస్తే. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేందుకు ప్రాధాన్యతనీస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలంలోని చినగొన్నూరు, పురిటిపాడు, శేరిదగ్గుమిల్లి, కూరాడ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన పల్లె పండగ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా 78. 78 లక్షల నిధులతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాము శంకుస్థాపన చేశారు.