గన్నవరం విమానాశ్రయం నుండి డిల్లీకి ఇండిగో సంస్థ నూతన సర్వీసును శనివారం కేంద్రమంత్రి కే. రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ప్రయాణికులకు మొదటి బోర్డింగ్ పాస్ ఇచ్చి సర్వీస్ ను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఆయన్ని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కొనియాడారు. మచిలీపట్నం, మైసూర్ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, యదవీర్ చామరాజ్ వడియార్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.