మల్లవల్లి పారిశ్రామికవాడ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గురువారం విజయవాడ రూరల్ మండలం అంబాపురం, పాతపాడు, నైనవరం గ్రామాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.