గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా పర్యటనకు వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మంగళవారం అమెరికా బయలుదేరి వెళ్లారు. ఎన్ఆర్ఐ అయిన యార్లగడ్డ వెంకట్రావు అమెరికాలోని వ్యాపార కార్యకలాపాల నిమిత్తం తరచూ అమెరికా వెళ్లి వస్తుండేవారు. గత ఏడాది జులై నెలలో అమెరికా వెళ్లెందుకు సన్నద్ధం కాగా రాజకీయ కార్యకలాపాల కారణంగా వెళ్లలేకపోయారు.