బాపులపాడు మండలం పెరికీడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2025-26 సంవత్సరానికి వార్షిక ప్రణాళిక పనుల గుర్తిపు ప్రక్రియ ముందస్తు గ్రామ సభ సమావేశమును నిర్వహించారు. సదరు సమావేశమునకు పంచాయతీ కార్యదర్శి శ్రీ మాదు రామకృష్ణ, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.