బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలైన ఉటూరు మండలంలోని కోయగరపాడులో బుధవారం ఎంపీడీవో జిఎస్వి శేషగిరిరావు, విస్తరణ అధికారి ఎం అమీర్ భాష, గ్రామ ఉపసర్పంచ్, జెసిబి లో ప్రయాణం చేసి పరిస్థితులను తెలుసుకున్నారు. వరద ముంపు కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజన వసతులు కల్పించారు. క్లోరినేషన్ జరిగిన తర్వాతే సాగునీరు అందిస్తామని తెలిపారు. ప్రజలందరూ కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలన్నారు.