రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు
మోపిదేవి కాలనీ వద్ద సబ్ స్టేషన్ కు వెళ్లే దారి సమీపంలో.. బుధవారం రాత్రి ప్రధాన జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం, సైకిల్ ఢీ కొన్నాయి. ఇరువురికి గాయాలు కాగా, అటుగా వస్తున్న టీడీపీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు వెనువెంటనే స్పందించారు. 108కు ఫోన్ చేసి జరిగిన విషయం తెలుపగా, హుటాహుటిన అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుంది. వారిని అవనిగడ్డలోని ఆసుపత్రికి తరలించారు.