వరద ముంపునకు గురైన అర్బన్ ప్రాంత గృహాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని.. లంక, ద్వీప గ్రామాల్లోని వరద బాధితులకు కూడా వర్తింపచేయాలని ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ప్రతిపాదించారు. బుధవారం మోపిదేవి మండలం బొబ్బర్లంకలో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో 300 వరద బాధిత కుటుంబాల వారికి ఎమ్మెల్సీ అశోక్ బాబు, బుద్ధప్రసాద్ చేతుల మీదుగా దుప్పట్లు, చీరలు, లుంగీలు, టవల్స్ సహాయంగా అందించారు.