వరద బాధితులకు ఐవీఎం ట్రస్ట్ సేవలు అపూర్వమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామంలో రూ. 4లక్షల 80 వేలు వ్యయంతో 400 నిరుపేద వరద బాధిత కుటుంబాలకు ఐవీఎం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వేములపల్లి సురేష్ - రోజా దంపతుల ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు, దుప్పట్లు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వరద బాధితులకు సహాయాన్ని అందించారు.