ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి: రైతులు

64பார்த்தது
ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి: రైతులు
వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మోపిదేవి మండల వాణిజ్య పంటల రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మోపిదేవి మండల పరిధిలోని బొబ్బర్లంక, కే. కొత్తపాలెం గ్రామాల్లో సుమారు 500 ఎకరాల వాణిజ్య, కూరగాయల పంటలు నీట మునిగి పూర్తిగా పాడైపోయాయని, ప్రభుత్వం ఆదుకోకపోతే తీవ్రంగా నష్టపోతామన్నారు. ఎకరానికి లక్ష రూపాయలు మేర పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி