2023 వన్డే వరల్డ్‌కప్‌నకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం చేకూరింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ వల్ల భారత్‌కు రూ. 11,637 కోట్ల ఆదాయం సమకూరిందని ఐసీసీ తాజాగా వెల్లడించింది. మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చిన నగరాల్లో టూరిజం, వసతి, ప్రయాణం, రవాణా, ఆహారం, పానీయాల అమ్మకం ద్వారా సుమారు రూ.7,232 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. అలాగే ప్రత్యక్షంగా సుమారు 48,000 కంటే ఎక్కువ మంది పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగ అవకాశాలు పొందారని ఐసీసీ తెలిపింది.