అవనిగడ్డ: పశు గణన విజయవంతం చేయండి
21వ అఖిల భారత పశు గణన విజయవంతం చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. శనివారం అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో పశుగణన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గేదెలు, ఎడ్లు, ఆవులు, మేకలు, గొర్రెలు, పందుల పెంపకందారులు తమ జీవాల సమాచారం అధికారులకు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సకాలంలో అందించి పశుగణన విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పాల్గొన్నారు.