నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలందరి అభిప్రాయం తీసుకుని సమర్థుడైన వ్యక్తిని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీగా నియమిస్తామని జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు స్పష్టం చేశారు. బుధవారం అవనిగడ్డలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.