విద్యార్థుల సేవాభావం స్ఫూర్తిదాయకం అని అవనిగడ్డ సీఐ యువకుమార్ తెలిపారు. బుధవారం అవనిగడ్డలోని ఎస్వీఎల్ క్రాంతి జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి లోకేష్ ఇల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధం అయింది. తమ సహచర విద్యార్థి కుటుంబానికి వచ్చిన కష్టం తెలుసుకున్న విద్యార్థులు రూ. 50వేలు సహాయం అందించారు. ఈ నేపథ్యంలో ఈ నగదును సీఐ యువకుమార్ చేతుల మీదగా అందజేశారు. కరస్పాండెంట్ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.