పట్టభద్రుల సంపూర్ణ మద్దతు కూటమి అభ్యర్థికే ఉందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం అవనిగడ్డలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్లు తరలివచ్చి తమ దరఖాస్తులు అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బండే కనకదుర్గ, మండలి రామ్మోహనరావు, కర్రా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.