అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని శ్రీకాకుళేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు, ఆలయ పండితులు ఆయనకు ఘన స్వాగతం పలుకగా, స్వామివారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి కలిపిన ఘటనపై అపవిత్రత తొలగిపోవాలని పూజలు చేశారు.