ఉల్లాస్ అక్షరాస్యతా కార్యక్రమంపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డా. నిధి మీనా అన్నారు. పదిహేనేళ్లకు పైబడిన వయస్సు వారిలో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించే ఉద్దేశంతో నిర్దేశించిన ఉల్లాస్ కార్యక్రమ అమలును బుధవారం ఇన్ చార్జ్ కలెక్టర్ నిధిమీనా గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.