అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడం పట్ల బీజేపీ మైలవరం నియోజకవర్గ కన్వీనర్ నూతులపాటి బాలకోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ కు ఆమోదం లభించిందన్నారు. రూ. 2, 245 కోట్లతో 57 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మాణం, కృష్ణానదిపై 3. 2 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన నిర్మాణం జరగబోతున్నట్లు వివరించారు.