ఆయుర్వేద తొలి వైద్యుడు భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు శుక్రవారం విజయవాడలో మంత్రి ఎస్. సవిత కి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పాతూరు మురళీకృష్ణ, మల్కాపురం కనకారావు, ద్రాక్షారపు సూరిబాబు, సోమవరపు నాగేశ్వరరావు, ఇంటూరి మురళీకృష్ణ, కె. భాను ప్రసాద్, తెన్నేటి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.