ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలు మూడో రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూ లైన్లో అమ్మవారిని దర్శించుకునే భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. 500 రూపాయల టికెట్ తీసుకున్నా అమ్మ దర్శనం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.