వైఎస్ షర్మిల విజయవాడలో నిరసనకు దిగారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఆమె ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లేట్లపై గంటెలతో బాదుతూ..'ఇది మంచి ప్రభుత్వం కాదు', 'సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్' అంటూ షర్మిల, కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.