బీసీ అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాలకు నిధుల కొరత రానివ్వబోమని మంత్రి ఎస్. సవిత స్పష్టంచేశారు. విజయవాడ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖాధికారులతో శుక్రవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏయే పథకాలు అమలవుతున్నాయి, వాటి పురోగతి ఏ స్థాయిలో ఉందో.? అడిగి తెలుసుకున్నారు.