కర్నూలులో రాష్ట్ర స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ సేవలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి భరత్ తెలిపారు. కర్నూల్ మెడికల్ కాలేజీ ఆవరణలోని రాష్ట్ర స్థాయి క్యాన్సర్ హాస్పిటల్‌ను జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. పలు విభాగాలు తిరిగి సమస్యలు తెలుసుకున్నారు.