పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీలో మున్సిపల్ వ్యాన్ డ్రైవర్ల వినూత్న నిరసన ప్రదర్శన చేశారు. గత మూడు నెలల నుండి జీతాలు లేవని, రోడ్డుపై భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు కార్మికులు. కార్మికులకు తాడిగడప సిఐటియు కమిటీ మద్దతు తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే 42 మంది తడి-పొడి చెత్త సేకరించే వ్యాన్ డ్రైవర్లకు గత మూడు నెలల నుండి జీతాలు అందకపోవడంతో నిరసన చేపట్టారు.