వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటానని పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా హామీ ఇచ్చారు. కృష్ణనది వరద ఉదృతి కారణంగా నష్టపోయిన తోట్లవల్లూరు మండలంలోని కనిగిరిలంక గ్రామ ప్రజలను ఆదివారం పరామర్శించి ధైర్యం చెప్పి వారికి ఆహార పదార్థాలు, కూరగాయలు, వాటర్ బాటిల్స్, నిత్యవసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు.