కృష్ణా జిల్లా మత్స్య సహకార సంఘం నూతన పాలకవర్గం ఎన్నికకు సంబంధించి కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 24న ఎన్నికలు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 17వ తేదీన నామినేషన్ల స్వీకరణ, 18న పరిశీలన, 19న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 24వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు.