రాష్ట్రంలో ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకొని గౌరవంగా జీవించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారధి అన్నారు. కృష్ణా జిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో శనివారం మొవ్వలో నిర్వహించిన మన ఇల్లు- మన గౌరవం హౌసింగ్ లబ్ధిదారుల అవగాహన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.