అధికారుల నిర్లక్ష్యం, అధికార పార్టీ నాయకుల ప్రమేయం వల్ల ఇంకా వరద బాధితులకు పరిహారం అందని పరిస్థితి ఏర్పడిందని కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ చైర్మన్ అభ్యర్థి గుంజ శ్రీనివాసు అన్నారు. వరద బాధితులను పరిహారం అందించాలని కోరుతూ ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట శ్రామిక నగర్ ప్రజలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల పక్షాన గుంజ శ్రీనివాసు మీడియాతో మాట్లాడారు.