పటిష్టమైన ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు ముదావత్ ఎం. నాయక్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శనివారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ కార్యదర్శి నాయక్ జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ, జేసీ గీతాంజలి శర్మలతో కలసి ఓటర్ల జాబితా తయారీపై సమావేశం నిర్వహించారు.