కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక మాసంలో సముద్రంలో స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో స్నానాలు ఆచరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్తీక పౌర్ణమి ప్రత్యేక విశిష్టత కలదని, అందుకే భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం సమకూర్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గంగాధర్ పాల్గొన్నారు.