ఉచిత ఇసుక పథకంపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర గనులు, బూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సోమవారం మచిలీపట్నం ఆర్ అండ్ బీ అతిధి గృహంలో మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలు, అక్రమ తవ్వకాల కారణంగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు.