ఆంధ్ర ప్రదేశ్ యోగ సభ ఆధ్వర్యంలో మచిలీపట్నం ఉదయపు నడక మిత్రమండలి భవనంలో నిర్వహిస్తున్న యోగా శిక్షణ శిబిరంలో జిల్లా కలెక్టర్ డికె. బాలాజీ సతీసమేతంగా సోమవారం హాజరయ్యారు. యోగ మాస్టర్ మద్దాల చింతయ్య యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.