ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తక్షణమే తొలగించాలని మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని కుమ్మరిపాలెం ఏరియా సర్వే నెంబర్ 180, 181 లలోని కుమ్మరి చెరువు ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారని అన్నారు. గతంలో ఈ స్థలంలో హెచ్చరిక బోర్డులు పెట్టామని కొందరు కావాలని ఆక్రమణలు చేపట్టారని, తక్షణమే వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.