దేవి శరన్నవరాత్రులలో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలోని అద్దాల బజార్ నందు వేంచేసియున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని (వెండి దేవాలయం) గురువారం మాజీ శాసనసభ్యులు, జనసేన నాయకులు సామినేని ఉదయభాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.