ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో మూలా నక్షత్రం పురస్కరించుకొని సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. సామూహిక అక్షరాభ్యాసం చేసి పుస్తకములు, పలకలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి మరియు డిప్యూటీ కమిషనర్ బి. హెచ్. వి. ఎస్ఎ. ఎన్. కిషోర్ కుమార్, ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ధర్మకర్తలు బెజవాడ శ్రీనివాసరావు, వెంకటరమణ భక్తులు పాల్గొన్నారు.