నాయి బ్రాహ్మణులకు రాష్ట్రంలోని ప్రతీ దేవాలయ పాలకవర్గాలలో అవకాశం కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలపడంతో పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవస్థానం కేశఖండన శాల వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి గురువారం పాలాభిషేకం నిర్వహించారు. జేఏసీ నేతలు కొల్లిపాక బ్రహ్మం ఆధ్వర్యంలో శ్రీ తిరుపతమ్మ కేశఖండన శాల క్షురకులు హాజరయ్యారు. నాయీ బ్రాహ్మనుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.