జగ్గయ్యపేట పారామౌంట్ ఇండస్ట్రీస్ అధినేత వెనిగళ్ళ సురేష్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. వరదల కారణంగా ఆర్టీసీ కాలనీకి చెందిన కొత్త భవదీప్ (12) కాలు పోగొట్టుకొని, విజయవాడ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడని ఆదివారం సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవడంతో. మానవత్వంతో స్పందించి, నాగరాజు కుమారుడి ఆరోగ్య ఖర్చులు నిమిత్తం 1,00,000/-అందించనున్నట్లు తెలిపారు. కొత్త నాగరాజు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.