ఏ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులైన, అధికారులైన జవాబుదారులుగా ఉంటూ మంచి చేసేందుకు పని చేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణ పరిధిలోని పలు సమస్యలపై మంగళవారం పురపాలక సంఘ శానిటేషన్, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావడంలో జరుగుతున్న అలస్యంపై అధికారులను ఎమ్మెల్యే రాము ప్రశ్నించారు.