నందివాడ మండల పరిధిలోని వరద ముంపు గ్రామాల్లో బాధిత కుటుంబాలకు మెరుగైన పరిహారం అందించేలా అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. వరద ప్రభావంతో ఏర్పడిన గడ్డి కొరత కారణంగా మండలంలోని పాడి రైతులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న 5. 5 మెట్రిక్ టన్నుల పశుగ్రాస పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చిన లింగాల గ్రామంలో ఆదివారం ప్రారంభించారు.